: ఢిల్లీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్
ఢిల్లీ శాసనసభ ఎన్నికల వేడి మరింత రాజుకుంది. కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల తొలి జాబితాను గురువారం విడుదల చేసింది. ఢిల్లీ శాసనసభ ఫలితాల్లో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ 24 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వీస్తున్న ప్రతికూల పవనాలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో చెక్ పెట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ సవాలు విసురుతున్నాయి. గత ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదురైన నేపథ్యంలో తాజా ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది.