: నా అందంతో భర్తను కట్టిపడేశా: జడా పింకెట్ స్మిత్


తన అందచందాలతో తన భర్తను కట్టిపడేశానని ప్రముఖ హాలీవుడ్ నటి జడా పింకెట్ స్మిత్ పేర్కొంది. 43 ఏళ్ల ప్రాయంలోనూ తన అందాన్ని చెక్కుచెదరనివ్వలేదని జడా వెల్లడించింది. పెళ్లైన 20 ఏళ్లలో ఏనాడూ భర్త తనను విడిచి ఉండలేదని జడా చెప్పింది. క్రమం తప్పకుండా జిమ్ కు వెళతానని, వర్కౌట్లు చేస్తూ అందాన్ని కాపాడుకుంటున్నానని వివరించింది. జడా పింకెట్ 20 ఏళ్ల క్రితం హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ ను వివాహం చేసుకుంది. మెన్ ఇన్ బ్లాక్, ఇండిపెండెన్స్ డే, బ్యాడ్ బోయ్స్ వంటి సినిమాల ద్వారా విల్ స్మిత్ ప్రేక్షకులకు సుపరిచితుడే. స్మిత్ కుమారుడు 'కరాటే కిడ్' సినిమా ద్వారా మంచి విజయాన్ని సాధించాడు.

  • Loading...

More Telugu News