: ఎయిరిండియా ఎయిర్ హోస్టెస్ లకు మైసూరు సిల్క్ శారీస్!
మైసూరు సిల్క్ చీరలంటే ఇష్టపడని మహిళలు ఉండరు. ఇక నుంచి వాటికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాప్యులారిటీ లభించనుంది. ఎయిరిండియాలోని ఫ్లయిట్ అటెండెంట్లు, ఎయిర్ హోస్టెస్ లు ఇకపై ఈ చీరలనే ధరించనున్నారు. ఎయిరిండియా కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ కు పదివేల చీరలకు ఆర్డర్ ఇచ్చింది. వాటి మొత్తం విలువ రూ.6.5 కోట్లు. పలు రకాల బ్రాండ్ల చీరలను పరిశీలించిన తరువాత చివరగా మైసూరు సిల్కు చీరలను ఎయిరిండియా ఎంచుకుందని కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ పి.బసవరాజ్ తెలిపారు. తమ చీరల ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి వెళుతుందని భావిస్తున్నామన్నారు.