: డీజీసీఏ డైరెక్టర్ జనరల్ గా తొలిసారి మహిళకు బాధ్యతలు


డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) చీఫ్ గా తొలిసారి ఓ మహిళ బాధ్యతలు చేపట్టనుండడం విశేషం. 1982 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ సత్యవతిని డీజీసీఏ డైరెక్టర్ జనరల్ గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సత్యవతి ప్రస్తుతం పౌర విమానయాన మంత్రిత్వ శాఖలో అడిషనల్ సెక్రటరీగానూ, ఆర్థిక సలహాదారుగానూ వ్యవహరిస్తున్నారు. సత్యవతి మచ్చలేని వ్యక్తిగా పేరుపొందారు. ప్రభాత్ కుమార్ స్థానంలో ఆమె డీజీగా బాధ్యతలు స్వీకరిస్తారు. డిప్యుటేషన్ పూర్తికావడంతో ప్రభాత్ కుమార్ తన యూపీ క్యాడర్ కు వెళతారు.

  • Loading...

More Telugu News