: వంద అంతర్జాతీయ పాటలు, ఆల్బమ్స్ జాబితాలో పీసీ పాట
బాలీవుడ్ నటి, గాయకురాలు ప్రియాంక చోప్రా పాడిన 'ఐ కాంట్ మేక్ యు లవ్ మి' వంద అంతర్జాతీయ పాటలు, ఆల్బమ్స్ జాబితాలో ఏడవ స్థానంలో నిలిచింది. 2014, ఏప్రిల్ లో విడుదలైన ఈ పాట పీసీ స్వయంగా పాడగా, ఎంతో పాప్యులారిటీ సంపాదించుకుంది. ఇక ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు ఏఆర్ రహ్మాన్ ట్రాక్స్ 'మై మైండ్ ఈజ్ ఏ స్ట్రేంజర్ విత్ అవుట్ యు', 'ద విలేజ్ ఆఫ్ సెయింట్ ఆంటోనిన్', 'న్యూ బిగినింగ్'లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. జాబితా అగ్రస్థానంలో పాప్ గాయకులు జెస్సీ జె, అరియాన గ్రాండే, నిక్కీ మింజాల 'బ్యాంగ్ బ్యాంగ్' ట్రాక్ నిలిచింది. హంగామా.కామ్ అనే వెబ్ సైట్ ఈ జాబితా రిలీజ్ చేసింది.