: మతపరమైన మోసాలకు 'పీకే' వ్యతిరేకం: పాత్రికేయుడు వేద్ ప్రతాప్ వైదిక్


అపార్థం చేసుకోవడంవల్లే 'పీకే' చిత్రాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారని పాత్రికేయుడు, యోగా గురువు బాబా రాందేవ్ సన్నిహితుడు వేద్ ప్రతాప్ వైదిక్ అన్నారు. కానీ వ్యతిరేకించే ముందు ఒక్కసారి సినిమాను చూడాలని, నిజానికి ఆ చిత్రం మతపరమైన మోసాలకు వ్యతిరేకమని చెప్పారు. ఈ చిత్రంపై పలువురు నిరసన వ్యక్తం చేస్తుండటంతో తాను ఆశ్చర్యపోయానని వైదిక్ పేర్కొన్నారు. 'పీకే'పై రాందేవ్ కూడా వ్యతిరేకంగా మాట్లాడటంపై వైదిక్ స్పందిస్తూ, "కొంత మంది చెబుతున్న దాన్ని బట్టి రాందేవ్ బాబా స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన పీకే సినిమా చూస్తే తన సొంత అభిప్రాయాన్ని వెల్లడిస్తారు" అని తెలిపారు. గతేడాది పాకిస్థాన్ లో తీవ్రవాద నేత హఫీజ్ సయీద్ ను వైదిక్ కలవడంపై తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News