: వాద్రాపై మొదలైన ఒత్తిడి... ఆదాయపు పన్ను శాఖ నోటీసులు


సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై ఒత్తిడి మరింతగా పెరిగింది. 2005-06 ఆర్థిక సంవత్సరం నుంచి జరిపిన స్థిరాస్తి లావాదేవీల వివరాలు ఇవ్వాలని ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఆయన ఆధ్వర్యంలోని స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పలు వివాదాస్పద భూ ఒప్పందాలు చేసుకుందని, సంస్థ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో డీఎల్ఎఫ్ తో కుదుర్చుకున్న ఒప్పందాలపై 22 ప్రశ్నలను ఐటీ శాఖ సంధించినట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News