: చంద్రబాబుకు వెండి కిరీటం తొడిగిన తుళ్లూరు రైతులు


తుళ్లూరులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అక్కడి రైతులు బ్రహ్మరథం పట్టారు. వెండి కిరీటాన్ని తొడిగి సత్కరించారు. ఈ సందర్భంగా రాజధాని నిర్మాణం కోసం కొంత మంది రైతులు తమ భూముల పాస్ బుక్ లను చంద్రబాబుకు అందించారు. తుళ్లూరు, నేలపాడు, ఐనవోలు గ్రామాల రైతులు 161 ఎకరాల భూములను రాజధాని కోసం ఇచ్చారు. వీరందరినీ చంద్రబాబు అభినందించారు. అంతే కాకుండా, పలు సంఘాలు రాజధాని నిర్మాణం కోసం ఆర్థిక సాయాన్ని చెక్ ల రూపంలో అందించాయి.

  • Loading...

More Telugu News