: ఈ నెల 6న వరల్డ్ కప్ కోసం టీమిండియా ఎంపిక
వచ్చే నెలలో ఆరంభం కానున్న వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియాను ఈ నెల 6న ఎంపిక చేయనున్నారు. చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ సమావేశమై తుది 15 మందితో జట్టును ప్రకటిస్తుంది. 30 మందితో ఇంతకుముందు ప్రకటించిన ప్రాబబుల్స్ నుంచి తుది జట్టును ఎంపిక చేస్తారని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ వరల్డ్ కప్ టోర్నీ ఫిబ్రవరి 14న ఆరంభం కానుంది. మార్చి 29న జరిగే ఫైనల్ తో ఈవెంట్ ముగుస్తుంది. సుప్రసిద్ధ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ టైటిల్ సమరానికి వేదిక.