: డ్రైవర్ లేకుండానే పరుగులెత్తే హైదరాబాద్ మెట్రో... దేశంలోనే తొలిసారి
దేశంలో తొలిసారిగా డ్రైవర్ లేకుండా మెట్రో రైలును పట్టాలపై నడిపిన ఘనత మనకు దక్కింది. ఆటోమెటిక్ ట్రైన్ ఆపరేషన్ (ఏటీఓ), కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ సిస్టం (సీబీటీసీ) సహాయంతో విజయవంతంగా రైలును నడిపి సరికొత్త రికార్డును హైదరాబాద్ మెట్రో సొంతం చేసుకుంది. ఇండియాలో ఈ టెక్నాలజీని వినియోగించడం ఇదే తొలిసారి. డ్రైవర్‌లేకుండా, నాగోలు-మెట్టుగూడ మధ్యలో మెట్రో రైలుకు జరిపిన టెస్ట్ రన్ సక్సెస్ అయింది. గమనాన్ని, వేగాన్ని నియంత్రించుకుని, అవసరమైనప్పుడు బ్రేకులు వేసుకుంటూ వెళ్తుండే రైలులో డ్రైవర్ ఉన్నప్పటికీ, బోగీల తలుపులు తెరచి, మూసే వరకే పరిమితం.