: ఈరోజు కాకుంటే రేపయినా పాక్ దారిలోకి వస్తుంది: రాజ్ నాథ్ సింగ్
జమ్మూ కాశ్మీర్ సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వద్ద పాకిస్థాన్ కాల్పులపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ఇరు దేశాల మధ్య సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. పాక్ అధికారులతో భారత దౌత్యవేత్తలు చర్చిస్తున్నారని, చర్చలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. అయితే పాక్ తప్పకుండా ఓ దారిలోకి వస్తుందని అనుకుంటున్నానన్న రాజ్ నాథ్, ఇవ్వాళ కాకుంటే రేపైనా జరగవచ్చని పేర్కొన్నారు. ఈ వారంలో పాక్ వరుసగా రెండుసార్లు కాల్పుల విరమణ ఉల్లంఘించి జమ్మూ ప్రాంతంలో కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.