: ప్రణాళికా సంఘం కొత్త పేరు 'నీతి ఆయోగ్'


ముందుగా ఊహించినట్టుగానే ప్రణాళికా సంఘం పేరును మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రణాళికా సంఘంను 'నీతి ఆయోగ్'గా పిలుస్తారు. దీంతో 1950 నుంచి సేవలందిస్తున్న ప్రణాళికా సంఘం తెరమరుగు కానుంది. 65 సంవత్సరాల ప్రణాళికా సంఘం చరిత్రలో ఇప్పటివరకూ 12 పంచవర్ష ప్రణాళికలు ప్రకటించగా, మొత్తం రూ.200 లక్షల కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. గత సంవత్సరంలో ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రణాళికా సంఘం స్థానంలో మరో సంస్థను ఏర్పాటు చేస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News