: స్మార్ట్ వార్డ్, స్మార్ట్ డివిజన్, స్మార్ట్ విలేజ్ లే లక్ష్యం: చంద్రబాబు
ఈ నెల 18న స్మార్ట్ పథకాన్ని ప్రారంభిస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. స్మార్ట్ వార్డ్, స్మార్ట్ డివిజన్, స్మార్ట్ విలేజ్ లే తమ లక్ష్యమని చెప్పారు. ఈ పథకం కోసం www.smart.ap.govt.in అనే పోర్టల్ ను ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వివరాలను తెలిపారు. సాంకేతికతను ఉపయోగించుకుని అభివృద్ధి పథంలో కొనసాగుదామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆర్థిక అసమానతలను తగ్గించడానికి తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.