: ఆరు కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగిల్చిన కొత్త సంవత్సరం
నూతన సంవత్సరం ఆరుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లాలో నేటి ఉదయం జరిగిన ఒక ప్రమాదంలో ఆరుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతిచెందారు. వార్కలా బీచ్ లో నిన్న రాత్రి న్యూ ఇయర్ వేడుకలకు హాజరైన టీకేఎమ్ కోలమ్ ఇంజినీరింగ్ విద్యార్థులు తిరిగి వస్తుండగా, వారి కారు అదుపుతప్పి లారీ క్రింది భాగంలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం ఆ మృతదేహాలను బయటకు తీయడం కష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది.