: మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఏపీఏటీ అధికారులు
ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ర్టేటివ్ ట్రైబ్యునల్ (ఏపీఏటీ) చైౖర్మన్ సహా సభ్యులంతా ఏకకాలంలో సెలవుపై వెళ్ళటాన్ని హై కోర్టు తప్పుపట్టింది. గత నెల 24 నుంచి మూడు రోజుల పాటు అందరూ సెలవు పెట్టారు. దీంతో పిటిషనర్లు చాలా ఇబ్బంది పడ్డారని, ఏపీఏటీ న్యాయవాదుల సంఘం కార్యదర్శి కల్యాణరావు హైకోర్టును ఆశ్రయించారు. వ్యవస్థ స్తంభించేలా అందరూ ఒకేసారి సెలవు తీసుకోవడం సమంజసం కాదని వ్యాఖ్యానించిన ధర్మాసనం, వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏదైనా అత్యవసరమైతే ముందుగానే చీఫ్ జస్టిస్ కు వివరించి ఉండాలని అభిప్రాయపడింది.