: కొత్త సంవత్సరంలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తాం: జైట్లీ
దేశంలో పలు రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. మౌలిక, నిర్మాణ రంగాలను పరుగులు పెట్టించేందుకు ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహిస్తామని చెప్పారు. ప్రైవేటు పెట్టుబడులతో ఈ రంగాలను కొత్త పుంతలు తొక్కిస్తామని వెల్లడించారు. గత ఏడు నెలల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని... ఫార్మా, బీమా తదితర రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితులు పెంచే యత్నం చేశామని చెప్పారు.