: విశాఖలో భారీ అలల తాకిడి... కూలిన చర్చి గోడ


పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో, విశాఖ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీని ప్రభావంతో, అలల ఉద్ధృతి ఎక్కువైంది. విశాఖలోని యారాడ బీచ్ వద్ద భారీ అలల తాకిడికి చర్చి గోడ కూలిపోయింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

  • Loading...

More Telugu News