: షాంగై తొక్కిసలాటలో 35 మంది మృతి... చైనా న్యూ ఇయర్ వేడుకల్లో అపశృతి


చైనా న్యూ ఇయర్ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. చైనా నగరం షాంగైలో గత రాత్రి జరిగిన ఓ పార్టీలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 35 మంది మృత్యువాతపడ్డారు. మరో 43 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయని సమాచారం. గాయాలపాలైన వారిని పోలీసులు హుటాహుటిన ఆస్పత్రులకు తరలించి వైద్య చికిత్సలు అందజేస్తున్నారు.

  • Loading...

More Telugu News