: నూతన సంవత్సరాదిన నయా జోష్!
నూతన సంవత్సర వేడుకలు గడచిన రాత్రి అంబరాన్నంటాయి. ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా మునిగితేలారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో యువత ఉర్రూతలూగింది. క్రమంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు వణికిస్తున్నా, యువత ఏమాత్రం వెనకడుగు వేయలేదు. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున పార్టీలు జరగగా, టాలీవుడ్ తారలతో పాటు బాలీవుడ్ తారలు కూడా జనాన్ని ఉర్రూతలూగించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అటు విజయవాడ, విశాఖల్లోనూ కొత్త సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఇదిలా ఉంటే, నూతన సంవత్సరాదినే వైకుంఠ ఏకాదశి రావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు భక్తజన సందోహంతో పోటెత్తాయి. తిరుమల, భద్రాచలం తదితర ఆలయాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.