: పాక్ కాల్పులకు భారత్ సమాధానం...నలుగురు పాక్ రేంజర్లు మృతి
పాకిస్థాన్ కవ్వింపులకు భారత్ దీటుగా సమాధానమిచ్చింది. భారత్-పాక్ సరిహద్దుల్లోని సాంబా సెక్టార్ లో భారత దళాలకు, పాక్ రేంజర్లకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు పాక్ రేంజర్లు మృత్యువాతపడ్డారు. తమ సహచరుల భౌతికకాయాలను తీసుకెళ్లేందుకు పాక్ రేంజర్లు తెల్లజెండాలను చూపారు. దీంతో భారత్ కాల్పులను ఆపేసింది. ఎలాంటి ఉద్రిక్తతలు లేనప్పటికీ పాక్ దళాలు కవ్వింపు చర్యలకు దిగి కాల్పులు జరిపాయి. దీంతో భారత్ దళాలు దీటుగా బదులిచ్చాయి. కాగా, రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉంది.