: సిడ్నీలో మిన్నంటిన సంబరాలు... నూతన సంవత్సరానికి ఆస్ట్రేలియా ఘనస్వాగతం
నూతన సంవత్సరానికి ఆస్ట్రేలియా ఘనస్వాగతం పలికింది. 2015 నూతన సంవత్సర వేడుకలు ఆస్ట్రేలియాలో అంగరంగ వైభవంగా జరిగాయి. సిడ్నీ నగరం విద్యుత్ కాంతులతో తళుకులీనింది. సిడ్నీ సముద్రతీరం మొత్తం నూతన సంవత్సర వేడుకలతో పులకించిపోయింది. సిడ్నీ నగరం బాణసంచా వెలుగుల్లో మునిగిపోయింది. భారత్ లోని నూతన సంవత్సర వేడుకలు ప్రారంభానికి కొన్ని గంటల ముందే ఆసీస్ లో వేడుకలు అద్భుతరీతిలో జరిగాయి.