: భారత మొబైల్ మార్కెట్లో మరో చైనా ఫోన్


భారతీయ మొబైల్ మార్కెట్లోకి మరో చైనా ఫోన్ రంగప్రవేశం చేయనుంది. భారతీయ మార్కెట్లో ఇప్పటికే విడుదలైన జియోమీ మొబైళ్లు సరికొత్త రికార్డులు తిరగరాస్తున్నాయి. జియోమీ స్పూర్తితో భారతీయ మొబైల్ మార్కెట్లోకి ఒప్పో కంపెనీ రంగప్రవేశం చేయనుంది. జనవరి ఒకటి నుంచి భారతీయ వినియోగదారుల ఆర్డర్లు ఆన్ లైన్ ద్వారా స్వీకరించనున్నట్టు ఒప్పో కంపెనీ ప్రకటించింది. భారతీయ మొబైల్ మార్కెట్లోకి 29,000 రూపాయల విలువ కలిగిన 4జీ ఎనేబుల్ హ్యాండ్ సెట్ ఆర్5 ను విడుదల చేయనుంది. ఈ ఫోన్ కేవలం 4.85 ఎంఎం మందం ఉంటుందని, ఈ ఫోన్ లో ఆక్టా-కోర్ క్వాల్ కామ్ ఎంఎస్ఎం 8939 ప్రాసెసర్ ను వినియోగించామని ఒప్పో కంపెనీ వివరించింది. 5.2 అంగుళాల డిస్ ప్లే కలిగిన ఈ ఫోన్ లో 13 మెగా పిక్సెల్ కెమెరా సౌకర్యం ఉందని కంపెనీ వివరించింది. అరగంట చార్జింగ్ చేస్తే 75 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుందని, 5 నిమిషాలు ఛార్జింగ్ పెడితే రెండు గంటలపాటు నిరంతరాయంగా మాట్లాడుకోవచ్చని ఒప్పో కంపెనీ తెలిపింది.

  • Loading...

More Telugu News