: 2014ను లాభాలతో ముగించిన స్టాక్‌ మార్కెట్లు


2014 సంవత్సరానికి భారత స్టాక్‌ మార్కెట్లు ఘనమైన లాభాలతో వీడ్కోలు పలికాయి. బుధవారం నాటి సెషన్లో బీఎస్‌సీ సెన్సెక్స్ 96 పాయింట్లు లాభపడి 27,499 వద్ద ముగియగా, నిఫ్టీ 34 పాయింట్లు పెరిగి 8,283 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తం మీద ఈ సంవత్సరంలో సెన్సెక్స్, నిఫ్టీలు 29 శాతం పైగా పెరగగా, బీఎస్ఈ కంపెనీల విలువ రూ.100 లక్షల కోట్లను దాటింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించిన రోజు 25,000 పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్, ఆ తర్వాత ఒక దశలో 28,500 పాయింట్ల వరకూ దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News