: కొత్త ఏడాది బహుమతి... పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించనున్న చమురు సంస్థలు!
నూతన సంవత్సరంలో దేశీయ ఆయిల్ కంపెనీలు వాహనదారులకు బహుమతి ఇవ్వబోతున్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లను మరింత తగ్గించేందుకు సిద్ధమవుతున్నాయి. లీటరుకు రూపాయి చొప్పున రేటు తగ్గవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు తగ్గించబోయే ధరలు నేటి అర్థరాత్రి నుంచి అమలయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు ఎన్నడూ లేనంతగా తక్కువ స్థాయికి పడిపోవడమే రేటు తగ్గడానికి కారణం. ఈ నెలలోనే పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ కు రూ.2 చొప్పున తగ్గాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక గత ఆగస్టు నుంచి పెట్రోల్ ధర వరుసగా ఎనిమిదిసార్లు తగ్గగా, డీజిల్ ధర గత అక్టోబర్ నుంచి వరుసగా నాలుగుసార్లు తగ్గింది.