: ఆ నిర్ణయం దంపతులను ప్రాణాలతో నిలిపింది!


సెలవులను ఒక్కొక్కరు ఒక్కోవిధంగా గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తుంటారు. కొందరు విహార యాత్రలకు వెళితే, ఇంకొందరు ఆధ్యాత్మికతవైపు మరలుతారు. మరికొందరు ఇంట్లోనే ఆత్మీయుల మధ్య ప్రశాంతంగా గడుపుతారు. అలా అందరితో గడపాలని తీసుకున్న నిర్ణయమే ఇండోనేషియా దంపతుల ప్రాణాలు నిలిపింది. వివరాల్లోకెళితే... క్రిస్మస్ సెలవుల్లో మలేసియాలోని ఆహ్లాదకర వాతావరణంలో గడుపుదామని ఇండోనేషియాకు చెందిన హర్టనో, లానో దంపతులు సురబయ నుంచి మలేసియాకు వెళ్లే విమానంలో టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే, ఆ తర్వాత తామిద్దరమే ఎంజాయ్ చేయడం ఎందుకన్న ఆలోచన వచ్చింది వారికి. కుటుంబ సభ్యులతో కలిసి పండగ చేసుకుంటే ఇంకా ఆనందం పొందవచ్చన్న భావనతో ఆ దంపతులు తమ ప్రయాణాన్ని విరమించుకున్నారు. ఈ క్రమంలో టికెట్లను క్యాన్సిల్ చేయించుకున్నారు. పండగ ఏర్పాట్లలో ఉండగా, తాము ప్రయాణించాల్సిన విమానం సముద్రంలో కుప్పకూలిపోయిందన్న వార్త విని షాకయ్యారు. ఈ ప్రమాదం తమను కలచివేసిందని ఆ దంపతులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News