: లైఫ్ జాకెట్ తో దొరికిన మృతదేహం... విమానం కూలుతోందని ముందే తెలుసా?
జావా సముద్రంలో కూలిపోయిన ఎయిర్ఏషియా విమాన ప్రమాదం వెనుక ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. సముద్రంపై తేలియాడుతున్న ఒక మృతదేహానికి లైఫ్ జాకెట్ ఉండటమే ఇందుకు కారణం. విమానంలో సీట్ కింద ఉండే లైఫ్ జాకెట్ తీసి ధరించాలంటే తప్పనిసరిగా పైలట్ నుంచి అనుమతి రావాలి. ఆ తరువాత కూడా జాకెట్ ధరించేందుకు కనీసం 2 నిమిషాల సమయం పడుతుంది. అంటే, విమానం కూలిపోబోతున్నదని పసిగట్టిన పైలట్ ప్రయాణికులను హెచ్చరించి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. దీంతో, కూలిపోయే ముందు చివరి నిమిషాలను ప్రయాణికులు ఎలా గడిపి ఉంటారో? అని ఆలోచిస్తేనే భయం కలిగే పరిస్థితి నెలకొంది.