: తిరుమలలో తోపులాటపై చంద్రబాబు స్పందన


తిరుమల పుణ్యక్షేత్రంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు పోటెత్తిన సంగతి తెలిసిందే. తమకు దర్శనం కల్పించాలంటూ భక్తులు ఒక్కసారిగా క్యూలైన్లలోకి ప్రవేశించేందుకు భారీగా ఎగబడ్డారు. దీంతో, అక్కడ తోపులాట జరిగింది. అనంతరం, పెద్ద సంఖ్యలో భక్తులు టీటీడీ ఏర్పాట్లపై మండిపడ్డారు. తమను కూడా అనుమతించాలంటూ వారు ఆందోళన చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. టీటీడీ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న ఆయన, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు.

  • Loading...

More Telugu News