: భారత్ లో చొరబడేందుకు సిద్ధంగా ఉన్న వందలాది ఉగ్రవాదులు!


వాస్తవాధీన రేఖ వద్ద భారత్ లో చొరబడేందుకు 150 నుంచి 170 మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని లెఫ్టినెంట్ జనరల్ సుబ్రతా సాహా వెల్లడించారు. వీరంతా పాకిస్తాన్ లో శిక్షణ పొందారని, వీరు భారత్ లో ప్రవేశించకుండా అడ్డుకోవాలని సైన్యానికి సూచించారు. ఈ ప్రాంతంలో మంచు దట్టంగా కురుస్తుండటం, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో సులభంగా చొరబడవచ్చన్న అభిప్రాయంతో ఉగ్రవాదులు కాచుకుని ఉన్నారని తెలిపారు. కాగా, ఎటువంటి కవ్వింపులు లేకుండానే పాకిస్తాన్ సైన్యం ఈ ఉదయం జరిపిన కాల్పుల్లో ఒక జవాను మరణించాడు.

  • Loading...

More Telugu News