: బాలచందర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన కమల్


దర్శక దిగ్గజం బాలచందర్ కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే, కమల్ హాసన్ తన గురువును చివరిసారిగా చూసుకోలేకపోయారు. ఆ సమయంలో కమల్ షూటింగ్ నిమిత్తం లండన్ లో ఉన్నారు. అక్కడి నుంచి వచ్చిన అనంతరం, ఈ ఉదయం చెన్నైలోని బాలచందర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, తమ మధ్య తండ్రీకొడుకుల సంబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి వద్ద కన్నా బాలచందర్ వద్దే ఎక్కువగా పెరిగానని తెలిపారు. ఆయన సినిమాలను ప్రభుత్వం భద్రపరచాలని, వాటిని రేపటి తరాలకు అందించాలని కోరారు. 'ఉత్తమ విలన్' చిత్రంలో బాలచందర్ నటించడం తన అదృష్టమని అన్నారు.

  • Loading...

More Telugu News