: గృహహింస తట్టుకోలేక 9 మంది కుటుంబ సభ్యుల హత్య
కెనడాలోని ఎడ్ మాంటన్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గృహహింస తట్టుకోలేక ఓ వ్యక్తి తన బంధువర్గంలోని ఏడుగురు పెద్దలను, ఇద్దరు చిన్నారులను కాల్చి చంపి, తను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సహజంగానే హింసాత్మక ఘటనలు అతి తక్కువగా జరిగే ఎడ్ మాంటన్ నగరంలో ఈ ఉదంతం సంచలనం సృష్టించింది. మూడు వేర్వేరు ప్రాంతాల నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో 1956 తరువాత ఇంతమంది ఒకేసారి దారుణ హత్యకు గురి కావడం ఇదే తొలిసారని తెలుస్తోంది.