: తిరుమలకు పోటెత్తిన భక్తులు... కిటకిటలాడుతున్న తిరు వీధులు


పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. నేటి ఉదయం దాకా తిరుమలలో రద్దీ సాధారణంగానే ఉన్నా గంటల వ్యవధిలో వేలాది మంది భక్తులు తిరుమల చేరుకున్నారు. దీంతో ప్రస్తుతం తిరుమల వీధులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. నూతన సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వచ్చారు. వైకుంఠ ఏకాదశి నాడు భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని ముందే ఊహించిన టీటీడీ అందుకనుగుణంగా భారీ ఏర్పాట్లు చేసింది. మరోవైపు సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండాలన్న భావనతో వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News