: రైతుల కోసం 'గ్రీన్ ఫాబ్లెట్'


ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ ఆరిడ్ ట్రాపిక్స్ (ఇక్రిశాట్) రైతుల కోసం ఓ ట్యాబ్లెట్ ను లాంచ్ చేసింది. దాని పేరు గ్రీన్ ఫాబ్లెట్. ఈ ఫాబ్లెట్ ధర రూ.18,900. దీని ద్వారా రైతులు శాస్త్రవేత్తలతో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం సాధ్యమవుతుంది. దీన్ని ఫోన్ గానూ, ట్యాబ్లెట్ కంప్యూటర్ గానూ కూడా ఉపయోగించవచ్చు. దీనిపై ఇక్రిశాట్ డైరక్టర్ జనరల్ విలియం దార్ మాట్లాడుతూ, సన్నకారు రైతులకు ప్రయోజనం కలిగించే క్రమంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడంలో ఇక్రిశాట్ ముందుంటుందని అన్నారు. "రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర దక్కించుకునేందుకు ఈ ఫాబ్లెట్ సాయపడుతుంది. వ్యవసాయ పనిముట్లను తక్కువ ధరకు పొందేందుకు తగిన సమాచారం దీని ద్వారా తెలుసుకోవచ్చు. మార్కెట్లతో వారిని అనుసంధానం చేస్తుంది" అని వివరించారు. ఈ గ్రీన్ ఫాబ్లెట్ హైదరాబాదులో తయారుకావడం విశేషం. ఇక్రిశాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తో కలిసి ఎన్.యు.ఎన్.సి సంస్థ దీన్ని రూపొందించింది. దీంట్లో ఉపయోగించే ప్రత్యేక 'గ్రీన్ సిమ్' ను ఏ మొబైల్ ఫోన్ లో అయినా వినియోగించవచ్చు.

  • Loading...

More Telugu News