: మమతా బెనర్జీని అరెస్ట్ చేస్తే పశ్చిమ బెంగాల్ ను బుగ్గి చేస్తాం: తృణమూల్ ఎంపీ


శారదా చిట్ ఫండ్ స్కాం అరెస్టుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై తృణమూల్ కాంగ్రెస్ వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ స్కాంలో ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రమేయం కూడా ఉందని ఇటీవల ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ ఇద్రిస్ అలీ మాట్లాడుతూ, "మమతాను మీరు (కేంద్ర ప్రభుత్వం) అరెస్టు చేస్తే పశ్చిమ బెంగాల్ ను కాల్చి బుగ్గి చేస్తాం" అని ఓ వీడియోలో కేంద్రాన్ని హెచ్చరించినట్టు తెలిసింది. మరోవైపు ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత పీసీ చాకో స్పందిస్తూ, "శారదా స్కాం దర్యాప్తులో ఏవైనా అవకతవకలు జరుగుతుంటే వాటిని అడ్డుకుని, దర్యాప్తు సరైన పద్ధతిలో జరిగేలా చూడాలి" అని సూచించారు.

  • Loading...

More Telugu News