: ధూళిపాళ్ల నరేంద్రకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి?


టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ పదవి దక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన నరేంద్ర ఇప్పటి వరకు ఐదు సార్లు గెలుపొందారు. మంత్రి వర్గంలో చోటు దక్కకపోవడంతో, ఆయన కొంత అలక పూనారు. ఓటమి లేకుండా వరుసగా గెలుపొందుతున్న తమ నేతకు న్యాయం చేయాలంటూ అభిమానులు, కార్యకర్తలు కూడా కోరుతుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై దృష్టి సారించారు. ఆర్టీసీ ఛైర్మన్ పదవి కూడా కీలకమైనదే కావడంతో, నరేంద్రకు ఆ పదవిని కట్టబెట్టాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని సమాచారం.

  • Loading...

More Telugu News