: ఎయిర్ ఏషియా మృతులకు సంతాపం తెలిపిన మోదీ


ఇండొనేషియాకు చెందిన ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో కూలిపోయిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ఘటన చాలా విషాదభరితమైనదని అన్నారు. 162 మంది ప్రయాణికులతో ఇండొనేషియాలోని సురబయ నుంచి సింగపూర్ బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానం (క్యూజెడ్ 8501) ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో రాడార్ నుంచి అదృశ్యమైన సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు అవిశ్రాంతంగా గాలించిన అనంతరం విమానం జావా సముద్రంలో కూలిపోయిందని గుర్తించారు.

  • Loading...

More Telugu News