: పద్ధతిగా ఉండకపోతే తాట తీస్తాం: హైదరాబాద్ రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్
హైదరాబాద్ నగరంలో రౌడీ షీటర్లపై పోలీసులు దృష్టి సారించారు. కొత్త ఏడాదిలో సరికొత్తగా జీవితం సాగించాలని రౌడీ షీటర్లకు ఉద్బోధిస్తూనే, పద్ధతి మార్చుకోకపోతే తాట తీస్తామని హెచ్చరికలు జారీ చేశారు. నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని నేటి ఉదయం పాతబస్తీ పరిధిలోని 600 మంది రౌడీ షీటర్లను స్టేషన్లకు పిలిపించిన పోలీసులు, సుదీర్ఘంగా కౌన్సెలింగ్ చేపట్టారు. పద్ధతిగా నడుచుకుంటే వారిపై నమోదైన రౌడీ షీట్ల తొలగింపునకు కూడా సిద్ధంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కౌన్సెలింగ్ పేరిట పోలీసుల నుంచి అకస్మాత్తుగా వచ్చిన ఆహ్వానాలకు రౌడీ షీటర్ల నుంచి మంచి స్పందనే లభించింది. పోలీసుల కౌన్సెలింగ్ కు రౌడీ షీటర్లు భారీ సంఖ్యలోనే హాజరయ్యారు.