: బ్రిటన్ కూ విస్తరించిన ఎబోలా... ఆరోగ్య కార్యకర్తకు వ్యాధి నిర్ధారణ


ప్రాణాంతక వ్యాధి ఎబోలా బ్రిటన్ కూ విస్తరించింది. ఆఫ్రికా దేశాల్లో జీవం పోసుకున్న ఈ వ్యాధి అగ్రరాజ్యం అమెరికాను వణికించిన సంగతి తెలిసిందే. ఆఫ్రికా దేశాల్లో వైద్య సేవలందించేందుకు వెళ్లిన అమెరికా వైద్యులు, నర్సులు ఆ వ్యాధి బారిన పడి మృత్యువాతపడ్డారు. తాజాగా ఈ వ్యాధి తమ దేశంలోనూ అడుగుపెట్టిందన్న సమాచారంతో బ్రిటిషర్లు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పశ్చిమ ఆప్రికా దేశాల్లో వైద్య చికిత్సలు అందించేందుకు వెళ్లిన బ్రిటన్ ఆరోగ్య కార్యకర్త పాలిన్ కాఫర్ కీకి ఎబోలా సోకిందని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం పాలిన్ ను లండన్ లోని ఎబోలా ట్రీట్ మెంట్ సెంటర్ లో ఉంచిన బ్రిటన్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పాలిన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News