: ధోనీ బ్రాండ్ వాల్యూకి ఢోకా లేదట!


టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాలన్న నిర్ణయం ధోనీ బ్రాండ్ వాల్యూపై ఎలాంటి ప్రభావం చూపబోదని అడ్వర్టైజింగ్ రంగ నిపుణులు ప్రసూన్ జోషి (బాలీవుడ్ గీత రచయిత), ప్రహ్లాద్ కక్కర్ అభిప్రాయపడ్డారు. టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడాన్ని పతనంగా భావించరాదని, ధోనీ ఇప్పటికీ సమున్నత స్థాయిలోనే ఉన్నాడని జోషి అన్నారు. టెస్టులకు గుడ్ బై చెప్పడంతో అతని ఇమేజ్ లో మార్పువస్తుందే కానీ, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినదని అభిప్రాయపడ్డారు. ఇక, కక్కర్ మాట్లాడుతూ, ధోనీ మార్కెట్ విలువకు సమీప భవిష్యత్తులో ఢోకా లేదని, ఒకవేళ అతను వన్డేలు, టీ20ల నుంచి కూడా తప్పుకుంటే అప్పుడు తగ్గుతుందని పేర్కొన్నారు. ధోనీ ఇప్పటికే ఎంతో సంపాదించాడని, డబ్బు గురించి చింత అతనికి అవసరం లేదని, శేష జీవితానికి సరిపడా వెనకేసుకున్నాడని వివరించారు. ఏదేమైనా ధోనీ బ్రాండ్ వాల్యూని టెస్టు క్రికెట్ కారణంగా నిర్ధారించలేమని, వన్డేలు, టీ20 క్రికెట్ తోనే అది ప్రభావితమవుతుందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News