: తెలంగాణ విద్యా మంత్రి వ్యాఖ్యలు అనాగరికం: ఏపీ మంత్రి గంటా


తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అనాగరికంగా మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎంసెట్ నిర్వహణకు సంబంధించి ఏపీ, తెలంగాణల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన గంటా... జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు ఆక్షేపణీయమని ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తాము రెండడుగులు తగ్గితే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం బిగదీసుకుని కూర్చుందని ఆయన ఆరోపించారు. నిన్నటి భేటీ సందర్భంగా ఎంసెట్ నిర్వహణ ఏపీ పరిధిలోకే వస్తుందన్న గవర్నర్ వాదననూ పట్టించుకోకుండా జగదీశ్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారని గంటా ఆరోపించారు.

  • Loading...

More Telugu News