: రాజపక్స తరపున సల్మాన్ ప్రచారం చేయడం సిగ్గుచేటు: సీపీఐ


శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మహీంద రాజపక్స తరపున బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ప్రచారం చేయడంపై రాజకీయ పార్టీల నుంచి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ వివాదంపై సీపీఐ పార్టీ స్పందిస్తూ, అలా చేయడం ఓ భారతీయ నటుడుకి సిగ్గుచేటని విమర్శించింది. "మానవ హక్కులు పరిరక్షించడంలో కళాకారులు ఎప్పుడూ ముందువరుసలో ఉంటారు. కానీ ఓ సామూహిక హత్యాకాండలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తరపున ప్రచారం చేయడం భారతీయ నటుడుకి నిజంగా సిగ్గుచేటు. ఇది చాలా తీవ్రమైన అంశం" అని సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి డి.రాజా అన్నారు. మారణకాండ గురించి రాజపక్సను చరిత్ర ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటుందన్నారు.

  • Loading...

More Telugu News