: కన్న తల్లిని కాల్చి చంపిన రెండేళ్ళ కొడుకు
ఆపదలో ప్రాణాలు కాపాడుకునేందుకు సహకరిస్తుందని కొనుక్కున్న తుపాకి ఆమె ప్రాణాలను హరించింది. ఆ తుపాకిని వాడింది ఆమె కన్న కొడుకే. వాడి వయసు కేవలం రెండు సంవత్సరాలే. ఈ ఘటన అమెరికాలో జరిగింది. 29 ఏళ్ల మహిళ తన కొడుకు, మరో ముగ్గురు పిల్లలతో కలిసి వాల్ మార్ట్ లో షాపింగ్ చేస్తోంది. ఆమె ఓ స్మాల్ క్యాలిబర్ హేండ్ గన్ ఉన్న తన పర్సును, రెండేళ్ల కొడుకును ఒక ట్రాలీలో ఉంచి తోసుకుంటూ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాడు ఆడుకుంటూ పొరపాటున ఆ హేండ్ గన్ ట్రిగ్గర్ నొక్కాడు. తుపాకి పేలి, అందులోని బులెట్ వాళ్ళమ్మకు తగిలింది. ఈమధ్య కాలంలో అమెరికాలో చిన్నారులకు తుపాకులు అందుబాటులో ఉంచడం, తమకు తెలియకుండానే పిల్లలు వాటిని వాడి ఇతరుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు పెరిగిపోయాయి.