: నమో అంటే... నో యాక్షన్, మెసేజ్ ఓన్లీ: మోదీపై జైరాం విసుర్లు


ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ మంగళవారం ఘాటు వ్యాఖ్యలతో దాడి చేశారు. దేశం మొత్తం నమో మాయలో పడిపోయిందన్న ఆయన, ‘‘నమో అంటే... నో యాక్షన్, మెసేజ్ ఓన్లీ’’ అని సెటైర్లు విసిరారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఏమాత్రం అభివృద్ధి నమోదు కాలేదన్న విషయాన్ని ప్రస్తావిస్తూ జైరాం ఈ వ్యాఖ్యలు చేశారు. నిన్నటి మేకిన్ ఇండియా వర్క్ షాప్ లో భాగంగా ఏబీసీడీ, రోడ్ అనే పదాలను విస్తరిస్తూ తమ పాలన తీరును ప్రకటించిన మోదీ వ్యాఖ్యలపై జైరాం ఘాటుగా స్పందించారు. ప్రజాస్వామ్య భారతాన్ని ఖూనీ చేసే పాత్రలో మోదీ నిలుస్తున్నారని కూడా జైరాం వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే, కేంద్రం ఆమోదం తెలిపిన భూసేకరణ చట్టాన్ని పశ్చిమ బెంగాల్ లో అమలు చేయబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చిచెప్పారు.

  • Loading...

More Telugu News