: ముక్కోటి ఏకాదశి దర్శనానికి అనుమతించండి... తిరుమలలో భక్తుల ఆందోళన


తిరుమలలో భక్తులు ఆందోళన చేస్తున్నారు. ముక్కోటి ఏకాదశి నాడు తిరుమల శ్రీవారి దర్శనానికి కంపార్ట్ మెంట్లలోకి తమను అనుమతించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక టీబీసీ ప్రాంతంలో రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కొత్త ఏడాది, ముక్కోటి ఏకాదశి పర్వదినం కావడంతో గురువారం వేకువజామున 1.30 నుంచే భక్తులకు దర్శనం అవకాశం ఇస్తున్నారు. ఇందులో కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తులు తదితర ప్రముఖులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇప్పటికే వారందరికీ టికెట్లు కూడా జారీ చేశారు. వైకుంఠ ప్రదక్షిణ మార్గాలు తెరచి ద్వాదశి సందర్భంగా శుక్రవారం వరకు శ్రీవారి కైంకర్యాలకు సమయంపోగా సామాన్య భక్తులకే అవకాశం ఇస్తున్నారు. అయితే ధర్మదర్శనం మినహా ఇతరత్రా ఎలాంటి దర్శనాలు ఉండవని చెప్పారు.

  • Loading...

More Telugu News