: దేశ రాజధానిలో ఉద్రిక్తత... పలువురికి గాయాలు


దేశ రాజధాని ఢిల్లీలోని కర్బాలా ప్రాంతంలో ఒక నిషేధ స్థలంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. కొన్ని సమాధులున్న కర్బాలా ప్రాంతంలోకి వెళ్లి చద్దర్లు సమర్పించేందుకు కేవలం ఇద్దరు మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. కానీ, అక్కడికి వెళ్లేందుకు ఒక వర్గానికి చెందినవారు పెద్దఎత్తున వచ్చారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. తాము ముందే పోలీసు స్టేషన్ లో అనుమతి కోరామని నిర్వాహకులు చెబుతుండగా, తాము అనుమతి ఇవ్వకుండానే వీరంతా ఉద్రిక్తతలు సృష్టించేలా ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో పలుమార్లు మత ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News