: కొత్త ఏడాదిలో బీజేపీలోకి కిరణ్ కుమార్ రెడ్డి


ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. కిరణ్ బీజేపీలో చేరే కార్యక్రమానికి సాక్షాత్తు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వస్తారని సమాచారం. గత రెండు రోజులుగా బీజేపీలో చేరే అంశంపై కిరణ్ తన సన్నిహితులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఎలాంటి కండిషన్లు లేకుండా, బేషరతుగానే కిరణ్ బీజేపీలో చేరితే బాగుంటుందని అమిత్ షా చిన్న మెలిక పెట్టారని విశ్వసనీయ సమాచారం. కిరణ్ తో పాటు ఆయన సన్నిహితులు పలువురు కూడా కాషాయ కండువా కప్పుకోనున్నారు. జనవరి 29న విజయవాడలో కిరణ్ తన వర్గంతో కలసి బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

  • Loading...

More Telugu News