: ప్రకాశం జిల్లాలో మరో చిట్టీల వ్యాపారి పరారీ... రూ.3 కోట్ల మేర కుచ్చుటోపీ!
ప్రకాశం జిల్లాలో చిట్టీల పేరిట జనాలకు కుచ్చుటోపీ పెడుతున్న మాయగాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. జిల్లా కేంద్రం ఒంగోలులో చిట్టీలు నడుపుతున్న రామకృష్ణ అనే ఫైనాన్స్ వ్యాపారి అదృశ్యమైన ఘటన కొద్దిసేపటి క్రితం వెలుగు చూసింది. చిట్టీల పేరిట వసూలు చేసిన దాదాపు రూ.3 కోట్లతో రామకృష్ణ పరారైనట్లు సమాచారం. రామకృష్ణ పరారీ విషయం తెలుసుకున్న బాధితులు సంతపేటలోని అతడి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.