: సన్నీ లియోన్ కు తోడు పూనం పాండే కూడా!
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఫుల్ జోష్ లో పార్టీలు చేసుకునే హైదరాబాదీలను తమ అందచందాలతో అలరించేందుకు ఇద్దరు హాట్ బ్యూటీలు పోటీపడుతున్నారు. ఈ రోజు రాత్రి జరిగే ఒక ఈవెంట్ లో సన్నీ లియోన్ పాల్గొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే మరో ఈవెంట్ లో పాల్గొనేందుకు పూనం పాండే కూడా రాజధానిలో కాలు పెట్టింది. నిజానికి 'మాలిని అండ్ కో' సినిమాలో పాట షూటింగ్ నిమిత్తం పూనం పాండే వస్తున్న విషయం తెలుసుకుని, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పార్టీ నిర్వాహకులు ఆమెతో డాన్సు చేయించేలా వెంటనే ఒప్పందం చేసుకున్నారు. ఇక ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీపడుతూ డాన్సులు చేస్తుంటే, కుర్రకారుకు కిక్కు మీద కిక్కే మరి!