: దేవుని దర్శించుకున్న కాసేపటికే వైకాపా నేత దారుణహత్య


నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, న్యాయవాది అల్లం నరేంద్ర (37) మంగళవారం రాత్రి హత్యకు గురయ్యారు. అంతకు కొద్దిసేపటి క్రితం ఆయన నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ తో కలసి రంగనాథస్వామి వారిని దర్శించుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సంతపేటలోని కృష్ణమందిరం వద్ద గల తన గది సమీపంలో రోడ్డు దాటుతుండగా, ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మారణాయుధాలతో దాడి చేశారు. వెనుకవైపు నుంచి దాడి చేసిన వారు కత్తులతో 26 పోట్లు పొడిచారు. తీవ్రగాయాల పాలైన ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నరేంద్రకు నాలుగేళ్ల క్రితమే అనుపమతో వివాహమైంది. ప్రస్తుతం ఆమె గర్భిణి. సమాచారం అందుకున్న అనిల్‌కుమార్ యాదవ్ హుటాహుటిన ఆసుపత్రి వద్దకు చేరుకొని ఘటనపై ఆరా తీశారు. హంతకులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు డీఎస్పీ మక్బుల్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

  • Loading...

More Telugu News