: గుంటూరు జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా... 10 మంది విద్యార్థులకు గాయాలు
గుంటూరు జిల్లాలో కొద్దిసేపటి క్రితం ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. జిల్లాలోని ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులను పాఠశాలకు తీసుకెళుతున్న క్రమంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో విద్యార్థులకు స్వల్ప గాయాలే అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందజేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.