: ఒకరి చేతులొకరు పట్టుకుని జల సమాధి: ఎయిర్ ఏషియా ప్రమాదంలో వెలుగు చూసిన విషాదం
ఇండోనేషియా నుంచి సింగపూర్ బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో కూలిపోయిన ఘటనలో మృత్యువాత పడ్డ వారిలో కొందరి మృతదేహాలు బోర్నియా తీరంలో మంగళవారం లభించాయి. వీటిని తొలుత పసిగట్టిన సైనికాధికారులు దిగ్భ్రమకు గురయ్యారు. విమాన ప్రమాదంలో చనిపోయిన వారిలో ముగ్గురు వ్యక్తులు ఒకరి చేతులొకరు పట్టుకుని మరీ చనిపోయారు. ప్రమాదంలో ప్రాణాలను రక్షించుకునే క్రమంలోనే వీరు అలా చేతులు పట్టుకుని ఉంటారన్న భావన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే, ఇప్పటిదాకా 50 లోపు మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగిలిన మృతదేహాలు కూడా లభిస్తే, ఎన్ని కన్నీటి గాథలు వెలుగు చూస్తాయో!